Saturday, October 11, 2014

పదాధారిత ఆజ్ఞానువర్తిన సాధనములు
(Command Line Interface Tools)





పదాధారిత ఆజ్ఞానువర్తినులలో తెలుగు అక్షరాల చిత్రీకరణ అద్వాన్నంగా ఉంది. గత కోన్ని వారాలుగా నేను చేసిన పరిశోధన ఫలితం ఈ క్రింద వర్ణిస్తాను.

విండోస్ పదాధారిత ఆజ్ఞానువర్తిని చెత్త అన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కనుక విండోస్ ని కాసేపు పక్కకు పెడదాం.

నా వద్ద  ఆపిల్ గణని లేదు. అదే కాక ఆపిల్ అన్నా, స్టీవ్ జాబ్స్ అహంకారమన్నా నాలు పరమ అసహ్యం. కనుక దానిని గూర్చి నేను ఈ వ్యాసంలో ఇఖ ముందు ప్రస్తావించను.

ఇఖ మిగిలింది లినక్స. లినక్సలో పదాధిరత ఆజ్ఞానువర్తినులు రంగస్థల (Desktop) అమలుతో జోడించబడుంటాయి. నాకు తెలిసిన రంగస్థలాలు నాలుగు ఈ క్రింద పట్టీకలో చేర్చబడినవి.

  • జ్ఞోం
  • కె.డి.ఈ
  • మేట్
  • యునిటీ

పై రంగస్థలాలు ఈ క్రింద విస్తృతంగా వివరించబడినవి.


కె.డి.ఈ కాన్సోల్:



ఈ క్రింది చలన చిత్రంలో కె.డి.ఈ కాన్సోల్లో తెలుగు చిత్రీకరణ చూపబడింది. ప్రసారి (Cursor) కదులుతుండగా అక్షరాల నిరర్ధక చిత్రీకరణ గమనార్హం. దీనికి సంబంధించి లోప వివరణ నివేదించ బడింది.


జ్ఞోం టర్మినల్:


జ్ఞోం టర్మినల్ని పరీక్షించడానికి నాకింకా అవకాశం దోరకలేదు. వీలు దొరికినప్పుడు అది కూడా పూర్తి చేశి ఇక్కడ ప్రచురిస్తాను.

మేట్ టర్మినల్:


మేట్ టర్మినల్లో కూడా కె.డి.ఈ లో ఉన్న సమస్యలే ఉన్నాయి. కాబట్టి దానికి కూడా ఒక లోప నివేదిక దాఖలుచేయబడింది.



జె.ఎడిట్ (JEdit):


జావా నిర్దేశనలో అనుభవం ఉన్నవాణ్ణి కాబట్టి, యూనికోడ్ చిత్రీకరణ, ప్రస్తుతం వాడుకలో ఉన్న అన్నీ సాధనములకంటే జావాలో మెరుగ్గా ఉందని గ్రహించాను. గనుక జావా ఆధారిత సంపాదన పనిముట్లలో అతిసాధారణమైన జె. ఎడిట్ లోని పదాధారిత ఆజ్ఞానువర్తిన సాధనమును పరీక్షించదలచాను. ఆ ప్రయత్న ఫలం ఈ క్రింద వర్ణించ బడింది.

ఈ క్రింది చిడత్రంలో తేలుగక్షరాలు పూరతిగా కనబడుతున్న విషయం గమనార్హం.

Selection_041.png


ఈ క్రింది చలనచిత్రం జె. ఎడిట్ తెలుగు అక్షరాల చిత్రీకరణ చూపించబడింది. జావా మరియు జె. ఎడిట్ సామర్ధ్యం స్పష్టంగా కనబడుతుంది.


కనుక ఏదేని జావా ఆధారిత సంపాదన పనిముట్లలో తెలుగు వ్రాయడం సాధ్యం.


పర్యవసానం


జావా ఆధారిత సంపాదన పనిముట్లని నమ్ముకోవడం ప్రస్తుతం తెలివైన పనిగా కనబడుతుంది. నేను జె. ఎడిట్ను వాడటం కొనసాగిస్తాను. భవిష్యత్తులో నా అనుభవం గురించి రాయప్రయత్నం చేస్తాను.